
ఇక సెలవుతీసుకోమంటూ తూరుపు నుండి సూర్యుడు ఉదయిస్తుంటే
ఒకవైపు కొక్కొరొకో అంటూ కూస్తూ,
అప్పటిదాకా అదమరిచి నిద్దురోతున్న జనాన్ని
మేల్కొల్పడానికి నడుంబిగించిన కోడి,
మరోవైపు కూటికోసం బయల్దేరుతూ,
తమ కిల కిల రావాలతొ తోటి మిత్రులను,
బంధువులను పిలుచుకెళ్తున్న పక్షులు.
ఒకవైపు వర్షపు జల్లుల్లా,
ఇంటిముందు కళ్ళాపి జల్లి ముగ్గులు వేస్తున్న అమ్మ
మరోవైపు హరినామము జపిస్తూ,
లయబద్దంగా చిడతలు వాయిస్తూ దక్షిణ స్వీకరిస్తున్న హరిదాసులు
ఒకవైపు దేవుని స్తుతిస్తూ,
వేదమంత్రాలు వినిపిస్తున్నగుళ్ళో మైకులు
మరోవైపు పండగ పిండి వంటల కోసం,
పిండిని దంచుతున్న రోకళ్ళ శబ్దాల మధ్య,
ఆరుబయట...మునగదీసుకుని,
మేల్కొల్పడానికి నడుంబిగించిన కోడి,
మరోవైపు కూటికోసం బయల్దేరుతూ,
తమ కిల కిల రావాలతొ తోటి మిత్రులను,
బంధువులను పిలుచుకెళ్తున్న పక్షులు.
ఒకవైపు వర్షపు జల్లుల్లా,
ఇంటిముందు కళ్ళాపి జల్లి ముగ్గులు వేస్తున్న అమ్మ
మరోవైపు హరినామము జపిస్తూ,
లయబద్దంగా చిడతలు వాయిస్తూ దక్షిణ స్వీకరిస్తున్న హరిదాసులు
ఒకవైపు దేవుని స్తుతిస్తూ,
వేదమంత్రాలు వినిపిస్తున్నగుళ్ళో మైకులు
మరోవైపు పండగ పిండి వంటల కోసం,
పిండిని దంచుతున్న రోకళ్ళ శబ్దాల మధ్య,
ఆరుబయట...మునగదీసుకుని,
మంచుతో తడిసి చల్లబడిన దుప్పటి ముసుగుపెట్టి,
శృతిలయలు పలికిస్తున్న కోయిల గానామృతాన్ని ఆస్వాదిస్తూ
నిద్ర లేవడానికి ప్రయత్నిస్తున్నాను.
శృతిలయలు పలికిస్తున్న కోయిల గానామృతాన్ని ఆస్వాదిస్తూ
నిద్ర లేవడానికి ప్రయత్నిస్తున్నాను.