తెల్లారి లెగిస్తే పేపర్ల నిండా అందరికీ కరెంట్...అందరినీ ఉద్దరించేస్తామంటూ రాజకీయనాయకులు వగ్దానాలు...ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప, నిజంగా రాష్ట్రాన్ని తద్వారా దేశాన్ని ఎలా బాగు చేస్తారో ఎవరూ నోరు విప్పరు. అభివ్రుద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా అంతగా అభివ్రుద్ధి చెందడానికి, మన దేశం ఇంకా ఇలా అభివ్రుద్ధి చెందుతూనే ఉండడానికి గల ముఖ్య కారనాలు ఏంటా అని ఆలొచిస్తే నాకు తట్టిన కారణం చూద్దాం...

నిషికి ముఖ్యావసరాలు మూడు.
1.కూడు  
2.గుడ్డ 
3.నీడ
ప్రతి మనిషీ ఈ మూడు సమకూరే దాకా వేరే వేటి గురించి ఆలోచించడు. ముందు ఈ మూడు అవసరాలు తీర్చుకోడానికే ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే ఈ మూడు సంపాదించుకోగలుగుతాడో అప్పుడే మిగతావాటి గురించి ఆలొచిస్తాడు. తినడానికి తిండి దొరకనివాడు, ఉండడానికి ఇల్లు లేనివాడు రియల్ ఎస్టేట్స్ గురించి ఎలా ఆలోచించగలుగుతాడు. అమెరికా లాంటి దేశాల్లో ఈ మూడు సంపాదించుకోడం పెద్ద కష్టం కాదు.(నా ఉద్దేశం కనీస అవసరాలు, విలాసవంతమైన జీవితం కాదు). అందుకే వారు అంత అభివ్రుద్ధి సాధించారు.

కానీ మన దేశ పరిస్తితి అలా కాదు...దేశంలో 65% మంది ఉదయం లెగిసిన దగ్గర నుండి ఆ కనీస అవసరాల కోసమే నిత్యం జీవితంతో పోరాటం సాగిస్తున్నారు. అలాంటి వారు చదువు, ఉద్యోగం ఇతరత్రా విషయాల గురించి ఏం ఆలోచిస్తారు. అందుకే దేశం అన్ని రంగాలలో అభివ్రుద్ధి సాధించడానికి గవర్నమెంట్ ఆ దిసగా మౌళిక వసతులు కల్పించాలి. ఎప్పుడైతే ఈ పేదలకి ఈ మూడు సమకూర్చగలుగుతామో అప్పుదు తప్పకుండా దేశం పురోగతి సాధిస్తుంది. 

ఇది నా ఆలోచన...ఎవరిదగ్గరైనా విలువైన ఆలోచనలు ఉంటే అందరితో పంచుకోండి...