మరల ఉదయాన్నే కలుస్తానంటు..
సురీడు పశ్చిమాన అస్తమించాక,
రాబోయే లక్ష్మీ దేవికి,రారమ్మంటూ
నానమ్మ దీపం పెట్టి స్వాగతం పలుకుతుంటే

ఇదిగో నేనొస్తున్నానంటూ
వెన్నెల నవ్వులు చిందిస్తున్న చందమామను చూసి,
ఓటమితో చీకటి తలదించుకుంటున్న వేళ..

ఆరు బయట నవ్వారు మంచం మీద పడుకుని
నాతో దగ్గరగ ఊసులాడుతున్న చంద్రుని వంక
అసూయగా చూస్తూ నింగిలొ
ముగ్గులు వేస్తున్న నక్షత్రాలను చూసి జలి పడుతుంటే

అన్నం వార్చి...ఊరమిరపగాయలు వేయించి
అమ్మ భొజనానికి రమ్మని పిలిచింది.
|
This entry was posted on 1:59 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

4 comments:

On December 2, 2007 at 6:53 PM , ఏకాంతపు దిలీప్ said...

@శ్రీ
చక్కగా రాసావు... నాకైతే మా అమ్మమ్మ గారింట్లో రాత్రి బయట కుర్చుని వేడీ పప్పు చారు అన్నం ఊరమిరపగాయలు నంచుకుని తిన్న రోజులు గుర్తొచ్చాయి... బ్లాగ్ షేడ్స్ బాగున్నాయి... ఆ చందమామ ఫొటో నాకు దొరికితే బాగుండేది... :)

 
On December 3, 2007 at 7:35 AM , రాధిక said...

మీ కవిత చదువుతూ వుంటే మనసు నిండిపోయింది.కానీ ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ చేసి కుర్చున్నా కూడా బాగా ఆకలవుతుందండి.నన్నూ ఎవరన్నా భజనానికి పిలిస్తే బాగుండును.
మీ బ్లాగును http://koodali.org/add కి కలపండి.

 
On December 3, 2007 at 8:38 AM , lipika said...

hmm.... sri nelo entha talent undhani naku e roje telisindhi.. ne kavithatho chinna naati gnapakallanintine melkolipaav abaai......huh... mallli chinapudu vaste bauntundhi....summer holidays lo malli ammama valla intiki velalani undhi.....

 
On December 3, 2007 at 9:43 PM , క్రాంతి said...

బావుందండి..కాని బ్లాగు రాయాటానికి స్పూర్తినిచ్చిన రాధిక గారికి "కృతఘ్నతలు" అని రాసారు.అది తప్పండి.
"కృతజ్ఞతలు" అని రాయాలి.