మన రాష్ట్రం చాలా ముందడుగు వేస్తోందని తెగ సంబరపడిపొతున్నాం. నిజమే కాదనను. కానీఅది అన్ని రంగాలలో జరిగితే చాలా బాగుంటుంది. వాస్తవానికి హైదరాబాదు పరిస్తితే తీసుకుంటే,అన్నిటి ధరలు ఆకాశాన్ని అంటాయి. మధ్య తరగతి మరియు సామాన్య కుటుంబాలకు ఏదీ అందకుండా పొయాయి.ఏ గవర్నమెంట్ ఉద్యోగమో చెస్తూ హైదరాబాదులో ఏ మూలనైనా ఇల్లు కొనుక్కుందామంటే స్థలాల రేట్లు మండిపోతున్నాయి.ఒకపక్క సంపన్నులు సబ్వేలు, పిజ్జా హట్లు అని తిరుగుతుంటే, మరో పక్క పేదవాడు ఈ పూట ఎలా గడుస్తుందో అనిమధనపడాల్సిన పరిస్థితి. ఒకపక్క ఉన్నవాడు గవర్నమెంట్ అండతో వేలకు వేలు ఎకరాలు దొచుకుంటుంటే, మరో పక్క పేదవాడు ఇప్పుడున్న గూడు రేపు ఉంటుందో ఉండదో అని దిగులు పడుతున్నాడు.హైదరాబాదులో రోజు రోజుకీ ట్రాఫిక్ సమస్య గందరగోలంగా తయారవుతోంది.దాన్ని పట్టించుకునే నాధుడే లేడు.రోడ్డు మీద తిరిగే వాహనాలు పెరుగుతున్నాయి కానీ రోడ్లు పెరగడంలేదు.దీనంతటికీ రెండు కారణాలు 1.రీల్ ఎస్టేట్ బూం కాగా 2.ఐ.టి బూం. రెండోది మధ్యతరగతి కుటుంబాలకూ సాయపడితే, మొదటిది మధ్యతరగతి కుటుంబాన్ని కుదేలు చేసింది.రీల్ ఎస్టేట్ బూంతో మధ్యతరగతి మనుగడె ప్రశ్నార్ధకమయ్యింది.రీల్ బూం మన చేతుల్లో లెదు.ఇక మిగిలింది ఐ.టి. ఐ.టి పుణ్యమా అని కంప్యూటర్ ఉద్యోగాలు పెరిగాయి కానీ మిగతావాటి పరిస్థితో? ఇలా ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్న అధిక విద్యార్ధులు ఐ.టి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ ఐ.టి కంపెనీలు అమెరికా మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. తాత్కాలికంగా అంతా బాగున్నట్టే అనిపించినా భవిష్యత్తులో ఇది మనకూ మన రాష్ట్రానికీ మంచిది కాదు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే బావిష్యత్తు బాగుంటుంది. దీనికి విద్యార్ధులలోనూ, తల్లిదండ్రులలోనూ మార్పు రావాలి. అందరూ ఎవరికి నచ్చిన రంగంలో వారు తమ ప్రతిభనినిరూపించుకోవాలి. మనలో ఎప్పటికైనా ఈ మార్పు వస్తుందని కోరుకుంటూ, ముందుగా అది నాతోనే మొదలవుతుందని ఆశిస్తూ
....మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఒక కంప్యూటర్ ఉద్యోగి
చంద్రబాబు .. రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ దాదాపు రెండున్నర దశాబ్దాలుగా మన రాష్ట్ర రాజకీయాలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శాసిస్తున్న ముఖ్య నేతలు. ఒకరు కాంగ్రెస్ మరొకరు టిడిపి. రానున్న ఎలెక్షన్స్లో ఎవరు నెగ్గనున్నారనేది ఇంకా మిలియన్డాలర్ల ప్రశ్నే. ఈసారి ఓటరు నాడి ఎలా ఉంటుందనెది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి తోడు చిరు తన పార్టీ తో జనంలోకి వెల్లనున్నారు. వీరి ముగ్గురి మధ్య పోరు చాలా ఆసక్తిగా ఉండబోతోంది. ఒకసారి ముగ్గురి బలాలు బలహీనతలు చూద్దాం.ముందుగా మన ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ గురించి చుద్దాం.
వై.ఎస్.ఆర్

అనుకూలం:

-->మొదటిది తిరుగులేని నాయకత్వ లక్షణం. తనను నమ్మినవారికి కొరిన వరాలు ప్రసాదించే గుణం వై.ఎస్.ఆర్ ని కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడిని చెసింది.
-->మెజారిటి కాంగ్రెస్ నేతలు వై.ఎస్.ఆర్ అనుగ్రహంతో బాగా వెనకేసుకున్నారు. ఎవరు నోరు మెదపడంలెదు. టి.డి.పి తో పొలిస్తే అసమ్మతి తక్కువనే చెప్పాలి.
-->ఎవరెన్ని విమర్శలు చేసినా అదరని బెదరని మొండి ధైర్యం.
-->అదృష్టం కలిసొచ్చి వర్షాలు బాగా పడడం.
-->తను ప్రవేసపెట్టిన పధకాలన్నీ ప్రజలకు బాగా ఉపయోగ పడుతున్నాయని ప్రజలను బాగానే మభ్యపెట్టారనే చెప్పాలి.
-->గ్యాస్ ధరలు పెరిగినప్పుదు ఋస్/-50 ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించి గ్రుహిణులను బాగా ఆకర్షించారు.
-->నక్సలైట్లను అణగతొక్కెయడం


ప్రతికూలం:
-->అధికారుల మీద కంట్రోల్ లేకపోవడం. ఆందరినీ ఇష్టమొచ్చినట్టు వదిలెయ్యడం
-->ధరల నియంత్రనలొ విఫలమయ్యారు.
-->మొదలెట్టిన ప్రాజెక్ట్లెవీ ఇంతవరకూ పూర్తికాకపోవడం.
-->విమర్శించిన వారిని తొక్కెయ్యాలని ప్రయత్నించడం.
--> శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి.
-->నచినవారికి అప్పణంగ భూములు, కాంట్రాచ్ట్లు దోచిపెట్టడం.
చంద్రబాబు
అనుకూలం:
--> హైదరాబదుకు ప్రపంచపటం లొ గుర్తింపు తెచ్చిన మాజి ముఖ్యమంత్రిగా మంచి కీర్తి ఉంది.
-->ఎన్ని కష్టాలెదురైనా మొండిగా అలానె పార్టిని నడిపించాలనే ప్రయత్నం
-->"మీకోసం" యాత్ర ద్వారా ప్రజలకు కొంత దగ్గరయ్యారనే చెప్పాలి.
--> మంచి పరిపాలనా దక్షుడు.-->సంపన్న వర్గాల్లో, స్టూడెంట్స్ ఇంక ఐ.టి ఉద్యోగుల్లో మంచి సానుకూలత ఉంది.
-->వై.ఎస్.ఆర్ గవర్నమెంట్ పై వీచె ప్రతికూల గాలులు ఏమన్నా సాయపడాలి
తికూలం:
ప్రతికూలం:
-->చిరు రూపంలో కొత్త పార్టీ వచ్చి తన క్యాడర్ బలహీనమవుతుండడం
-->పార్టీ కార్యకర్తలపై పట్టు కొల్పొతున్నారు.
-->అధికారంలో ఉండగ తను చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకొవడంలొ విఫలమయ్యారు.
-->ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు.
-->అధికార పర్టీ పై ఉన్న ప్రతికూలతను తనకు అనుకూలంగా మార్చుకోడంలో విఫలమయ్యారు.
చిరు: ఇంక ప్రకటించని పార్టీ గురించి ఎక్కువ చెప్పుకోలేము. కానీ కొన్ని అంశాలు చూద్దాంఅనుకూలం:

-->మెగా స్టార్ గ తిరుగులెని ఇమేజ్.
-->కులాలకు, వయస్సుకు అతీతంగా అభిమానులు ఉండడం.
-->బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంఘ సేవా కర్యక్రమాలతో మంచి పెరుంది.
-->అందరితో మంచిగ కలుపుకు పోవాలనుకునే నైజం
-->అల్లు అరవింద్ వంటి చాణక్యుడు పక్కనుండడం
తికూలం:
ప్రతికూలం:
-->పార్టీ పెట్టకుండానే దానిపై కొందరు కుల ముద్ర వేయ్యలని ప్రయత్నించడం
-->ఎవ్వరినొప్పించక తానొవ్వక అనె మనస్తత్వం
-->విమర్శలకు గింజుకోవడం
-->రాజకీయ అనుభవం కలవారు తన చుట్టు లేకపొవడం.
-->అల్లు అరవింద్ వంటి శకుని పక్కనుండడం(అవును రెండూ ఆయనే).
--> నిర్నయం తీసుకోడంలో చాలా జాప్యం చేసే గుణం.

నేననుకోడం బట్టి ఈసారి హంగ్ గవర్నమెంట్ వస్తుంది.ఎవరికీ పూర్తి మెజరిటి రాదు.చిరు ఇంక చంద్రబాబు కి కావలసింది కాంగ్రెస్ అధికారంలోకి రాకుండ చెయ్యడం.చిరు, చంద్రబాబు కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చెస్తారేమో.దేవేందర్ గౌడ్ మళ్ళీ టి.డి.పి కి సపోర్ట్ చేస్తడేమో. రామోజీ ఈసారి ఏం చక్రం తిప్పనున్నాదో.చూద్దాం ఏమి జరగబోతోందో



"ఈ పైన విశ్లేషనలన్నీ పూర్తిగా నా అభిప్రాయాలు. ఎవ్వరినీ నొప్పించడానికి రాసినవి కావు"

సచిన్....ఈ పేరు వింటేనే ప్రత్యర్ధి గుండెల్లో రైళ్ళు పరుగెడతాయి.దాదాపు రెండు దశాబ్ధాలుగా భారత్ క్రికెత్ అంటే సచినే అనేంతగా చెరగని ముద్ర వేసాడు.సగటు భారతీయునిలా నాక్కూడా సచిన్ అంటే ప్రానం.నేను నాలుగో తరగతిలో ఉండగా మొదటి సారి సచిన్ ని ఆడటం చూసాను.అప్పటి నుండి సచిన్ నా జీవితంలో ఒక భాగమైపోయాడు.సచిన్ బాగా ఆడిన రోజు ఆనందంగా నిద్రపొతాను.తను బాగా ఆడని రోజు దిగులుగా ఉంటుంది.ఇండియా గెలిచినప్పటికంటే సచిన్ సెంచరీ కొడితేనే ఎక్కువ ఆనందించేవాడిని. కేవలం సచిన్ ఆటతోనే నన్ను ఆకట్టుకోలేదు, మైదానంలో కాని, బయట కనీ,అతని ప్రవర్తన ఎంతో హుందాగా ఉంటుంది. అతని ఆట గురించి కొత్తగా చెప్పేదేంలేదు.ప్రపంచం మొత్తానికి తెలుసు అతని గొప్పతనం.సచిన్ ని డాన్ బ్రాడ్మన్ తో పొల్చెవారిని చూస్తే నాకు బాదేస్తుంది.ఇద్దరు వేరు వేరు పరిస్తితుల్లో ఆడరు.డాన్ ఆడిన రోజుల్లొ క్రికెట్ ఇంత అడ్వాన్సెడ్ కాదు. టెక్నికల్ గా సచిన్, డాన్ సరిసమానులు కావొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో డాన్ ఎలా ఆడుండెవాడొ. ఇప్పటిలా డైవింగ్ క్యాచ్లు,టెలివిజన్ రీప్లేలు ఆనాడు లేవు.ఇప్పుడున్న పరిస్తితుల్లో రెండు దసాబ్ధాలు నెట్టుకురావడం, పైగా నెగ్గుకురావడం చాలా కష్టం. అలాంటి సచిన్ ని కొంతమంది విమర్శకులు తొలగించాలనో లేక రిటైర్ అవ్వాలనో విమర్సించడం చాలా అన్యాయం.సచిన్ తనకి తానుగా రెతైర్ అవుతాను అనేదాకా ఆడనివ్వలి. జన్మకో శివరాత్రి అన్నట్టు మన అద్రుష్టం కొద్దీ అతని బ్యటింగ్ చుసే అవకాసం దక్కింది. సచిన్ లేని క్రికెట్ని నేను ఊహించుకోలేను.మరి కొన్నేళ్ళు సచిన్ ఇలాగే ఆడాలని కొరుకుంటూ...మన బి.సి.సి.ఐ ఆడనిస్తుందని ఆశిస్తూ సచిన్ కి నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నాను.