తెల్లారి లెగిస్తే పేపర్ల నిండా అందరికీ కరెంట్...అందరినీ ఉద్దరించేస్తామంటూ రాజకీయనాయకులు వగ్దానాలు...ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప, నిజంగా రాష్ట్రాన్ని తద్వారా దేశాన్ని ఎలా బాగు చేస్తారో ఎవరూ నోరు విప్పరు. అభివ్రుద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా అంతగా అభివ్రుద్ధి చెందడానికి, మన దేశం ఇంకా ఇలా అభివ్రుద్ధి చెందుతూనే ఉండడానికి గల ముఖ్య కారనాలు ఏంటా అని ఆలొచిస్తే నాకు తట్టిన కారణం చూద్దాం...

నిషికి ముఖ్యావసరాలు మూడు.
1.కూడు  
2.గుడ్డ 
3.నీడ
ప్రతి మనిషీ ఈ మూడు సమకూరే దాకా వేరే వేటి గురించి ఆలోచించడు. ముందు ఈ మూడు అవసరాలు తీర్చుకోడానికే ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే ఈ మూడు సంపాదించుకోగలుగుతాడో అప్పుడే మిగతావాటి గురించి ఆలొచిస్తాడు. తినడానికి తిండి దొరకనివాడు, ఉండడానికి ఇల్లు లేనివాడు రియల్ ఎస్టేట్స్ గురించి ఎలా ఆలోచించగలుగుతాడు. అమెరికా లాంటి దేశాల్లో ఈ మూడు సంపాదించుకోడం పెద్ద కష్టం కాదు.(నా ఉద్దేశం కనీస అవసరాలు, విలాసవంతమైన జీవితం కాదు). అందుకే వారు అంత అభివ్రుద్ధి సాధించారు.

కానీ మన దేశ పరిస్తితి అలా కాదు...దేశంలో 65% మంది ఉదయం లెగిసిన దగ్గర నుండి ఆ కనీస అవసరాల కోసమే నిత్యం జీవితంతో పోరాటం సాగిస్తున్నారు. అలాంటి వారు చదువు, ఉద్యోగం ఇతరత్రా విషయాల గురించి ఏం ఆలోచిస్తారు. అందుకే దేశం అన్ని రంగాలలో అభివ్రుద్ధి సాధించడానికి గవర్నమెంట్ ఆ దిసగా మౌళిక వసతులు కల్పించాలి. ఎప్పుడైతే ఈ పేదలకి ఈ మూడు సమకూర్చగలుగుతామో అప్పుదు తప్పకుండా దేశం పురోగతి సాధిస్తుంది. 

ఇది నా ఆలోచన...ఎవరిదగ్గరైనా విలువైన ఆలోచనలు ఉంటే అందరితో పంచుకోండి...


|
This entry was posted on 10:38 PM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 comments:

On January 24, 2009 at 1:06 AM , Chittoor Murugesan said...

కాసింత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సైతం తన ప్రధాన అవసరాలను ఉచితంగా పొందాలని చూడడు. మీరు నా ఆపరేషన్ ఇండియా 2000 ప్లాన్ గురించి ఒక సారి చదవండి. ఆపరేషన్ ఇండియా 2000 అమలైతే ప్రతి పౌరునికి చేతినిండా పని దొరుకుతుంది. అసలు వండి పెట్టే వారు (ఖాళిగా) ఉండరు, వండుకునే ఓపిక ఉండదు. అప్పుడైతే ప్రతి పౌరుడు జతీయ సంపదను పెంచే ప్రక్రియలో భాగం పంచుకుంటుంటాడు కాబట్టి మీరు చెప్పినట్టే అన్నీ ఉచితంగా అంద చేయొచ్చు

 
On January 24, 2009 at 7:16 AM , Sunny said...

మురుగేషణ్ గారు నా పోస్ట్ లో అవి ఉచితంగా కల్పించాలని నేను ఎక్కడా చెప్పలేదండి. దానికి తగ్గట్టుగా మౌళిక వసతులు కల్పించాలని మాత్రమే చెప్పాను.

 
On January 24, 2009 at 9:11 PM , Unknown said...

మంచి విషయం మీద రాశారు. ఆభినందనలు. మనిషి తిండి, గుడ్డ, ఇల్లు దొరకగానే తనేమిటో ప్రపంచానికి ప్రకటించుకోవడానికి తాపత్రయ పడతాడు. అసలు తనేమిటీ, ప్రపంచమేమిటీ, దానిలో తన ఉనికి ఏమిటీ తెలుసుకోకుండానే నిరూపించుకోవడానికీ ప్రకటించుకోవడానికీ ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నమే, ఆ అజ్ఞానమే ఈ విధ్వంసాలకన్నిటికీ మూలం. అదే మిగతావారికి తిండి,గుడ్డ,ఇల్లు లేకుండాచేస్తుంది. మనిషి ప్రాపంచిక, జీవన సత్యాన్ని కనుగొని చేరుకోలేనంతకాలం ఈ విధ్వంసం తప్పదు.