మన రాష్ట్రం చాలా ముందడుగు వేస్తోందని తెగ సంబరపడిపొతున్నాం. నిజమే కాదనను. కానీఅది అన్ని రంగాలలో జరిగితే చాలా బాగుంటుంది. వాస్తవానికి హైదరాబాదు పరిస్తితే తీసుకుంటే,అన్నిటి ధరలు ఆకాశాన్ని అంటాయి. మధ్య తరగతి మరియు సామాన్య కుటుంబాలకు ఏదీ అందకుండా పొయాయి.ఏ గవర్నమెంట్ ఉద్యోగమో చెస్తూ హైదరాబాదులో ఏ మూలనైనా ఇల్లు కొనుక్కుందామంటే స్థలాల రేట్లు మండిపోతున్నాయి.ఒకపక్క సంపన్నులు సబ్వేలు, పిజ్జా హట్లు అని తిరుగుతుంటే, మరో పక్క పేదవాడు ఈ పూట ఎలా గడుస్తుందో అనిమధనపడాల్సిన పరిస్థితి. ఒకపక్క ఉన్నవాడు గవర్నమెంట్ అండతో వేలకు వేలు ఎకరాలు దొచుకుంటుంటే, మరో పక్క పేదవాడు ఇప్పుడున్న గూడు రేపు ఉంటుందో ఉండదో అని దిగులు పడుతున్నాడు.హైదరాబాదులో రోజు రోజుకీ ట్రాఫిక్ సమస్య గందరగోలంగా తయారవుతోంది.దాన్ని పట్టించుకునే నాధుడే లేడు.రోడ్డు మీద తిరిగే వాహనాలు పెరుగుతున్నాయి కానీ రోడ్లు పెరగడంలేదు.దీనంతటికీ రెండు కారణాలు 1.రీల్ ఎస్టేట్ బూం కాగా 2.ఐ.టి బూం. రెండోది మధ్యతరగతి కుటుంబాలకూ సాయపడితే, మొదటిది మధ్యతరగతి కుటుంబాన్ని కుదేలు చేసింది.రీల్ ఎస్టేట్ బూంతో మధ్యతరగతి మనుగడె ప్రశ్నార్ధకమయ్యింది.రీల్ బూం మన చేతుల్లో లెదు.ఇక మిగిలింది ఐ.టి. ఐ.టి పుణ్యమా అని కంప్యూటర్ ఉద్యోగాలు పెరిగాయి కానీ మిగతావాటి పరిస్థితో? ఇలా ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్న అధిక విద్యార్ధులు ఐ.టి వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ ఐ.టి కంపెనీలు అమెరికా మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. తాత్కాలికంగా అంతా బాగున్నట్టే అనిపించినా భవిష్యత్తులో ఇది మనకూ మన రాష్ట్రానికీ మంచిది కాదు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే బావిష్యత్తు బాగుంటుంది. దీనికి విద్యార్ధులలోనూ, తల్లిదండ్రులలోనూ మార్పు రావాలి. అందరూ ఎవరికి నచ్చిన రంగంలో వారు తమ ప్రతిభనినిరూపించుకోవాలి. మనలో ఎప్పటికైనా ఈ మార్పు వస్తుందని కోరుకుంటూ, ముందుగా అది నాతోనే మొదలవుతుందని ఆశిస్తూ
....మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఒక కంప్యూటర్ ఉద్యోగి
|
This entry was posted on 6:46 AM and is filed under . You can follow any responses to this entry through the RSS 2.0 feed. You can leave a response, or trackback from your own site.

3 comments:

On August 18, 2008 at 10:58 AM , Rajendra Devarapalli said...

అయ్యా మీరు అర్జంటుగా మీబ్లాగులో రంగులు మార్చాలి మహాప్రభో!అసలు ఒక్క ముక్క చదవలేకపొతున్నాం మరి !

 
On August 19, 2008 at 7:58 AM , శ్రీ said...

శ్రీ గారు, నేను నోవైలో ఉంటాను.నా బ్లాగు చదువుతూ ఉంటారా?

 
On March 15, 2009 at 8:59 PM , Sirisha said...

thank you sri....mee blogs kuda 2 unnayi kani okati restrict chesaru anukunta...second one choosanu bagundhi....