
సచిన్....ఈ పేరు వింటేనే ప్రత్యర్ధి గుండెల్లో రైళ్ళు పరుగెడతాయి.దాదాపు రెండు దశాబ్ధాలుగా భారత్ క్రికెత్ అంటే సచినే అనేంతగా చెరగని ముద్ర వేసాడు.సగటు భారతీయునిలా నాక్కూడా సచిన్ అంటే ప్రానం.నేను నాలుగో తరగతిలో ఉండగా మొదటి సారి సచిన్ ని ఆడటం చూసాను.అప్పటి నుండి సచిన్ నా జీవితంలో ఒక భాగమైపోయాడు.సచిన్ బాగా ఆడిన రోజు ఆనందంగా నిద్రపొతాను.తను బాగా ఆడని రోజు దిగులుగా ఉంటుంది.ఇండియా గెలిచినప్పటికంటే సచిన్ సెంచరీ కొడితేనే ఎక్కువ ఆనందించేవాడిని. కేవలం సచిన్ ఆటతోనే నన్ను ఆకట్టుకోలేదు, మైదానంలో కాని, బయట కనీ,అతని ప్రవర్తన ఎంతో హుందాగా ఉంటుంది. అతని ఆట గురించి కొత్తగా చెప్పేదేంలేదు.ప్రపంచం మొత్తానికి తెలుసు అతని గొప్పతనం.సచిన్ ని డాన్ బ్రాడ్మన్ తో పొల్చెవారిని చూస్తే నాకు బాదేస్తుంది.ఇద్దరు వేరు వేరు పరిస్తితుల్లో ఆడరు.డాన్ ఆడిన రోజుల్లొ క్రికెట్ ఇంత అడ్వాన్సెడ్ కాదు. టెక్నికల్ గా సచిన్, డాన్ సరిసమానులు కావొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్తితుల్లో డాన్ ఎలా ఆడుండెవాడొ. ఇప్పటిలా డైవింగ్ క్యాచ్లు,టెలివిజన్ రీప్లేలు ఆనాడు లేవు.ఇప్పుడున్న పరిస్తితుల్లో రెండు దసాబ్ధాలు నెట్టుకురావడం, పైగా నెగ్గుకురావడం చాలా కష్టం. అలాంటి సచిన్ ని కొంతమంది విమర్శకులు తొలగించాలనో లేక రిటైర్ అవ్వాలనో విమర్సించడం చాలా అన్యాయం.సచిన్ తనకి తానుగా రెతైర్ అవుతాను అనేదాకా ఆడనివ్వలి. జన్మకో శివరాత్రి అన్నట్టు మన అద్రుష్టం కొద్దీ అతని బ్యటింగ్ చుసే అవకాసం దక్కింది. సచిన్ లేని క్రికెట్ని నేను ఊహించుకోలేను.మరి కొన్నేళ్ళు సచిన్ ఇలాగే ఆడాలని కొరుకుంటూ...మన బి.సి.సి.ఐ ఆడనిస్తుందని ఆశిస్తూ సచిన్ కి నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నాను.
3 comments:
సచిన్ గొప్ప ఆటగాడు అలాగే గొప్ప వ్యక్తి అనటంలో నాకెలాంటి సందేహం లేదు. కానీ సచినే భారత క్రికెట్ కాదు. సచిన్ కన్నా ముందూ భారత్ చెప్పుకోదగిన విజయాలు సాధించింది. సచిన్ రిటైర్ అయ్యిన తర్వాతా సాధిస్తుంది. షేన్ వార్న్, గిల్ క్రిస్ట్, మెక్ గ్రాత్, పొలాక్ ల లాగా సచిన్ కూడా శిఖరాగ్రం మీద వుండగానే రిటైర్ అయితే గౌరవప్రదంగా వుంటుంది. గత వైభవ ఛాయల్లో నెట్టుకొస్తున్నాడనే అపప్రథని ఇప్పటికే సచిన్ మోస్తున్నాడు(మీలాంటి వీరాభిమానులు అంగీకరించినా లేకున్నా ఇది నిజం :))
>>ఇండియా గెలిచినప్పటికంటే సచిన్ సెంచరీ కొడితేనే ఎక్కువ ఆనందించేవాడిని
ఇది మాత్రం ఖండించాల్సిన వ్యాఖ్య. ఏ ఆటలోనయినా వ్యక్తులకన్నా జట్టు/దేశమే ప్రధానం.
>>డాన్ ఆడిన రోజుల్లొ క్రికెట్ ఇంత అడ్వాన్సెడ్ కాదు
టెక్నాలజీలో మార్పులు వచ్చినంత మాత్రాన ఆటలో బేసిక్స్ మారిపోతాయా? ఆమాటకొస్తే అరిభయంకరులైన లిల్లీ, థామ్సన్, గార్నర్, హోల్డింగ్, రాబర్ట్స్, మార్షల్ వంటి వారి హయాములో ఆడిన గవాస్కర్ ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి. ఆ స్థాయి బౌలర్లు ఇప్పుడేరీ?
మరో మాట. ఆ అరివీర భయంకరుల బౌలింగ్ లో గవాస్కరుడు హెల్మెట్ కూడా లేకుండా ఆడేవాడు (కెరీర్ చివర్లో skull cap వాడాడనుకోండి). సచిన్ అలా చెయ్యగలడా?
డాన్, సునీల్, సచిన్, అజార్, ఇంజమాం, పాంటింగ్, లారా .... ఎవరి గొప్పదనం వారిదే. ఒకరితో ఒకరికి పోలికలనవసరం.
జట్టులో ఆడటానికి ఎవరికయినా ప్రస్తుత ఫామే ప్రాతిపదిక కావాలి.
నేనూ మీలాంటి సచిన్ ఫానునే అయినా నాకు దేశానికి ఆడే జట్టే ముఖ్యం. ఓ ఆటగాడిని చూడడం కంటే జట్టు నెగ్గడం చూడడానికే నేను ఇష్టపడతాను.